విదేశాలకు తరలిస్తున్న ప్రాచీన బుద్ధుడి విగ్రహం స్వాధీనం..
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/budda-statue.jpg)
బెంగళూరు (CLiC2NEWS): ప్రాచీన కాలం నాటి బుద్ధుడి విగ్రహాన్ని కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 200 ఏళ్ల నాటి బుద్ధుడి విగ్రహాన్ని విదేశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను పోలీసులు ఆరెస్టు చేసి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు నిందుతులను అరెస్టు చేశారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన పంచమర్తి రఘురామ చౌదరి అలియాస్ పి.రఘు, బెంగళూరుకు చెందిన ఉదయ్‌కుమార్, డిసౌజా, శరణ్ నాయర్, ప్రసన్న ఉన్నట్లు పోలీసులు తెలిపారు.