రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత చెక్ అందజేత
పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం : సిపి చంద్రశేఖర్ రెడ్డి

రామగుండం (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ ఆర్ముడ్ రామగుండం విభాగంలో ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఎ. మల్లేష్ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతని కుటుంబ సభ్యులకు రూ. 8,33,000 భద్రత చెక్ ను శనివారం సిపి రామగుండం కార్యాలయంలో పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సిపి చంద్రశేఖర్ అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఓ నాగమణి, పర్వేజ్ నిజాం, సూపరింటెండెంట్, సిసి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.