ఈ నెల 18న నగరానికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రపతి ద్రౌపదిముర్ము డిసెంబర్ 18వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటకు తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్‌కు రానున్న సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. తిరిగి 23న ఢిల్లీకి వెళ్తారు. నగరంలో తగిన ఏర్పాట్ల నిమిత్తం సిఎస్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.