AP: రేపట్నుంచి ప్రజలకు అందుబాటులో ప్రజా ప్రతినిధులు..
అమరావతి (CLiC2NEWS): ఆగస్టు 1 నుండి ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు జనసేన కార్యాలయం ప్రకటనలో తెలిపింది. నెలలో కనీసం రెండు రోజుల పాటు పార్టి ఎంపిలు , ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ ఇటీవల స్పష్టం చేశారు. దానిలో భాగంగా పార్టి ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉండి ప్రజల నుండి అర్జీలు, పార్టి శ్రేణుల నుండి అభ్యర్థనలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టి ప్రజాప్రతినిధులు కేంద్ర కార్యాలయంలో ఉండే షెడ్యూల్‌ను సిద్దం చేశారు.