ఎయిరిండియా ఉద్యోగుల‌కు శుభ‌వార్త..

ఢిల్లీ (CLiC2NEWS): ప్ర‌ముఖ విమాన‌యాన సంస్థ ఎయిరిండియా ఉద్యోగుల‌కు శుభ‌వార్త తెలిపింది. ఉద్యోగుల‌కు వేత‌న పెంపును ప్ర‌క‌టించింది. పైల‌ట్ల ప‌నితీరు ఆధారంగా బోన‌స్ కూడా చెల్లించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఫ‌స్ట్ ఆఫీస‌ర్‌, కెప్టెన్ల వేత‌నం నెల‌కు రూ. 5వేలు మేర పెంపు, జూనియ‌ర్ ఫ‌స్ట్ ఆఫీస‌ర్‌కు ఎలాంటి పెంపూ చెప‌ట్ట‌లేదు. ఏడాదికి గ‌రిష్టంగా బోన‌స్ కింద రూ. 1.8 ల‌క్ష‌ల వ‌ర‌కు చెల్లిస్తారు. జూనియ‌ర్ ఆఫీస‌ర్‌కు రూ. 42 వేలు, ఫ‌స్ట్ ఆఫీస‌ర్‌కు రూ. 50 వేలు, కెప్టెన్ల‌కు రూ. 60 వేలు, క‌మాండ‌ర్ల‌కు రూ. 1.32 లక్ష‌లు, సీనియ‌ర్ క‌మాండ‌ర్ల‌కు రూ. 1.80 ల‌క్ష‌ల వ‌ర‌కు గ‌రిష్టంగా బోన‌స్ అందనుంది. 2023 డిసెంబ‌ర్ 31 కంటే ముందు ఈ సంస్థ‌లో చేరిన వారికి ఈ పెంపు వ‌ర్తిస్తుంది. పెరిగిన వేత‌నాలు 2024 ఏప్రిల్ నుండి అమ‌ల్లోకి రానున్న‌ట్లు ఎయిరిండియా సిహెచ్ ఆర్ొ ర‌వీంద్ర‌కుమార్ జిపి వెల్ల‌డించారు. ఎయిరిండియాలో ప్ర‌స్తుతం మెత్తం 18 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వ‌హిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.