అక్రమంగా రవాణాచేస్తున్న గంజాయిని పట్టుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు
రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి బ్రిడ్జ్ సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్న 4 కేజీల గాంజాయిని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. అయిదుగురు వ్యక్తులు ద్విచక్రవాహనాలపై గాంజాయిని తీసుకెళ్తున్నారు. పోలీసులకు ముందుగా అందిన సమాచారం మేరకు బైక్లను ఆపి తనిఖీ చేశారు. నిందితుల వద్దనుండి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ సుమారు రూ. 80వేలు ఉంటుంది.
గాజుల సిద్ధార్ధ, అజరుద్దీన్ , శ్రీరామ్ , వినోద్, పర్వేజ్ వీరంతా 21 ఏళ్ల లోపు వారే. చెడు అలవాట్లకు, గంజాయి కి బానిసై గంజాయి తను తాగడం కోసం మరియు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో ఈ విధంగా గంజాయి అక్రమరవాణాకు సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా తీర్యాణి నుండి గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి గోదావరిఖని ప్రాంతంలోని స్టూడెంట్స్, యువత కి ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారని తెలిపారు. నిందితులను స్టేషన్కు తరలించారు.