జలమండలిలో ఘనంగా మూడో రోజు బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్ (CLiC2NEWS): ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా ఆడపడుచులు ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే బతుకమ్మ సంబరాలు రోజుకో రకమైన పూలతో రోజుకో ప్రత్యేకమైన నైవేధ్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తూ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. జలమండలి మహిళా ఉద్యోగులు బతుకమ్మలను పేర్చి ఉల్లాసంగా బతుకమ్మ పాటలతో ఆడిపాడారు.