‘తెలంగాణ ఉద్యమాల చ‌రిత్ర’ మూడో ఎడిష‌న్ విడుద‌ల‌

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ జ‌ల వ‌న‌రుల అభివృద్ధి సంస్థ ఛైర్మ‌న్ వి ప్ర‌కాశ్ ర‌చించిన తెలంగాణ ఉద్యమాల చ‌రిత్ర మూడో ఎడిష‌న్ ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి హ‌రీశ్‌రావు విడుద‌ల చేశారు. మంగ‌ళ‌వారం  హైద‌రాబాద్‌లోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థ‌లో ఈకార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ..

150 సంవ‌త్స‌రాల ఉద్య‌మ చ‌రిత్ర‌ను వి ప్ర‌కాశ్ ఎంతో శ్ర‌మించి, లోతుగా అధ్య‌య‌నం చేసి, ఒక చ‌క్క‌టి పుస్త‌కాన్ని ర‌చించార‌ని పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం త్వ‌ర‌లో విడుద‌ల చేసే గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, పోలీసు ఉద్యోగాల‌తో పాటు ప‌లు పోటి ప‌రీక్ష‌ల‌కు ఈ పుస్త‌కం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ఈ పుస్త‌కం ప్ర‌తి రిక్రూట్‌మెంట్ సంస్థ ప్రామాణిక రిఫ‌రెన్స్ గ్రంథం కింద ప‌రిగ‌ణిస్తుంద‌ని చెప్పారు. ప్ర‌కాశ్ మ‌లిద‌శ ఉద్య‌మంలో కీక పాత్ర పోషించారాని కొనియాడారు. మ‌లిద‌శ ఉద్య‌మంలో ప్ర‌తి అంశాన్ని వ్య‌క్తిగ‌తంగా ప‌రిశీలించ‌డం, ప‌రిణామాల‌ను విశ్లేషించి పోటి ప‌రీక్ష‌ల‌కు అనుగుణంగా ఈ పుస్త‌కాన్ని ర‌చించార‌ని మంత్రి ప్ర‌శంసించారు.

Leave A Reply

Your email address will not be published.