వాగు ప్రవాహంలో కొట్టుకుపోయిన ట్రాక్టర్

పాడేరు (CLiC2NEWS): అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయి చప్టా వాగు ప్రవాహానికి ట్రాక్టర్ కొట్టుకుపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లాగరాయి చప్టా వాగు ఉద్దృతికి కొత్త ట్రాక్టర్ బోల్తాపడి ప్రవాహంలో చిక్కుకుంది. డ్రైవర్‌ను స్థానికులు అతికష్టంమీద వెలికి తీసినట్లు సమాచారం. వాగు ప్రవాహానికి ఐదు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
[…] వాగు ప్రవాహంలో కొట్టుకుపోయిన ట్రాక… […]