ఘనంగా నటుడు కార్తకేయ వివాహవేడుక

హైదరాబాద్(CLiC2NEWS): టాలీవుడ్ నటుడు కార్తకేయ వివాహవేడుక ఘనంగా జరిగింది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ తన ప్రియురాలు లోహిత మెడలో మూడుముళ్లు వేశాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మెగ స్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్పుత్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
‘ఆర్ఎక్స్ 100’తో మొదటి ప్రయత్నంలోనే మంచి నటనను ప్రదర్శించాడు. తరువాత ’90 ml’, ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా నటిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘రాజా విక్రమార్క’ చిత్రం విడుదలైన విషయం తెలిసినదే. అజిత్ హీరోగా నటించిన ‘వలిమై’ చిత్రంలో కార్తికేయ కీ రోల్ పోషిస్తున్నారు.