మగవారి మనసు సున్నితమైనది

కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్ డా.హిప్నో పద్మా కమలాకర్

మగవారి మనసు సున్నితమైనది

మగవారు శారీరకంగా దృఢంగా ఉంటారు కానీ, మానసికంగా చాలా సున్నితమైన వారిని డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు.నవభారత్ లైయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో ” మగవారి మానసిక సమస్యలపై ఉచిత కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ మగవారు మనసులో బాధను తొందరగా చెప్పలేరన్నారు. పైకి దృఢంగా కనిపిస్తున్నా మనసు అల్లకల్లోలంగా ఉంటుందన్నారు. మగవారు ఏడిస్తే తప్పంటారన్నారు. అదే ఏడుపును బలహినతగా భావిస్తారన్నారు. కన్నీటిని ఆవిరి చేస్తే గుండె ను, ఆరోగ్యాన్ని నిలువెల్లా దహించి వేస్తాయన్నారు. కరోనా టైం లో 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు వున్న మగవారు ఆందోళనలతో ఎక్కువ మంది చనిపోయారని తెలిపారు. తనవారికి ఏమవుతుందో అనే ఆలోచనలే ఎక్కువ గా ఉండే వున్నారు.అనుక్షణం పని, తల్లి తండ్రులు, పిల్లల గురించి ఆలోచిస్తూ తనను తాను మర్చిపోతున్నారన్నారు. జీవితమంతా ఎదుటవారి గురించి బ్రతికేవారే మగవారన్నారు. అమ్మలు, భార్యలు ఆదరించి, ఓదార్పు ఇస్తే అదే మగవారికి కొండత అండ అని చెప్పారు. మగవారు మాటలకందని అనుభూతిని అందిస్తారని తెలిపారు. సెక్స్ పరంగా భార్య అనుకూలంగా లేకపోతే ఎక్కువ మంది మానసిక సమస్యలకి లోనైయే అవకాశాలు ఉన్నాయి న్నారు. మృగంగా మారే అవకాశం కూడా ఉందన్నారు. మగవారి మనస్తత్వం పిల్లలాంటిదన్నారు. వ్యక్తిగత కౌన్సెలింగ్ ఇచ్చి మానసిక సమస్యలపై అవగాహన కలిగించారు. ప్రతి ఆదివారం `2 గంటల నుంచి 6` గంటల వరకు ఉచిత ఫోన్ కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు.వివరాలకు 9390044031 కు సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో లైన్ పి. స్వరుపారాణి, వ్యక్తి త్వ వికాస నిపుణులు శివకుమారి, కొమరయ్య, సాయి, సాహిత్,హిప్నో హిమకర్ పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.