జగిత్యాల జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి..

జగిత్యాల (CLiC2NEWS): జిల్లాలోని ధర్మపురి మండలం తుమ్మెనాల చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. సెలవు రోజు కావటంతో చిన్నారులు ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. యశాంత్ , శరత్ నవదీప్ మృత దేహాలను స్థానికులు చెరువునుండి బయటకు తీశారు. ఈ ఘటనతో పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలసిస్తున్నారు. ఆప్రాంతమంతా విషాయఛాయలు అలుముకున్నాయి.