మిర్యాల‌గూడ‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

మిర్యాల‌గూడ‌ (CLiC2NEWS): నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. స్థానిక చింతపల్లి హైవే వద్ద ఆగి ఉన్న లారీని ఒక వెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెందారు. మరో పది మంది కి తీవ్ర గాయాలు అయ్యాయి. Ap39x6414 నెంబర్ గల ఒక ప్ర‌యివేట్‌ ట్రావెల్స్ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లుచేప‌ట్టారు. క్షత గాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని పోలీసులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తొంది. మృతుల‌ను ప్ర‌కాశం జిల్ల‌కు చెందిన మ‌ల్లికార్జున్ (40), నాగేశ్వ‌ర్ రావు (44), గుంటూరు జిల్లాకు చెందిన జ‌య‌రావ్ (42)గా గుర్తించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్ర‌మాదానికి గురైన బ‌స్సు
Leave A Reply

Your email address will not be published.