ఎపిలో మూడు కొత్త రైళ్లు ప్రారంభం..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో రేపు మూడు కొత్త రైళ్లు ప్రారంభం కానున్నాయి. గుంటూరు రైల్వే స్టేషన్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతులమీదుగా మూడు రైళ్లు పట్టాలెక్కనున్నట్లు సమాచారం. హుబ్బల్లి-నర్సాపుర్, విశాఖపట్టణం-గుంటూరు, నంద్యాల- రేణిగుంట రైళ్లను రైల్వేశాఖ రేపటి నుండి అందుబాటులోకి తీసుకురానుంది.