Ramagundam: పాత మొబైల్ ఫోన్లను సేకరిస్తున్నముగ్గురు వ్యక్తులు అరెస్టు

రామగుండం పోలీస్ కమీషనరేట్ (CLiC2NEWS): పాతవి, పనికిరావని పక్కన పెట్టిన మొబైల్ ఫోన్లను కొంటామని ఊరూరా కొందరు తిరుగుతూ వాటిని సేకరిస్తున్నారు. వీటిని సైబర్ నేరాల్లో వినియోగించేందుకు పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. వీటిని కొనగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి పని చేయని సుమారు 4000 మొబైల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం.