ఆల‌య నిర్మాణ రంగంలో మూడేళ్ల బిఎ డిగ్రీ కోర్సు ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం..

యాదాద్రి (CLiC2NEWS):

ఆల‌య నిర్మాణ రంగంలో బిఎ డిగ్రీ కోర్సులో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతున్నారు. ఈ మేర‌కు యాద‌గిరి గుట్ట టెంపుల్ అథారిటి ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మూడేళ్ల బిఎ డిగ్రీ (ట్రెడిష‌న‌ల్ స్క‌ల్ప్చ‌ర్, ఆర్కిటెక్చ‌ర్) కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 16గా నిర్ణ‌యించారు. పూర్తి వివ‌రాల‌కు www. ytda.in వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు. లేదా 040- 23400616, 9705887664 ఫోన్ నంబ‌ర్ల‌ను సంప్ర‌దించి తెలుసుకోవ‌చ్చు.

Leave A Reply

Your email address will not be published.