రైలు పట్టాలపై ముగ్గరు యువకులు దుర్మరణం
పట్నా (CLiC2NEWS): రైలు పట్టాలపై కూర్చుని ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన పట్నాలోని పశ్చిమ చంపారన్ జిల్లా నార్కటియాగంజ్-ముజఫర్‌పుర్ రైల్వే మార్గంలో చోటుచేసుకుంది. చంపారన్ జిల్లాకు చెందిన యువకులు పట్టాలపై కూర్చుని పబ్జి ఆడుతుండగా .. వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాద సమయంలో వారు ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవడం వలనే రైలు వస్తున్నట్లు గమనించలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరణించిన వారిని ఫర్కాన్ ఆలం, సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీగా పోలీసులు గుర్తించారు.