తిరుపతిలో కూలిన టిటిడి ఆర్చి

తిరుపతి (CLiC2NEWS): తిరుమలలోని రామానుజ సర్కిల్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్వాగత ఆర్చి (కమాన్) కూలింది. నగరంలోని రిలయన్స్ మార్ట్ వద్ద ఉండే ఆర్చి కూలడంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. కాగా ఆ వ్యక్తిని దవాఖానకు తరలించారు. గరుడవారధి నిర్మాణ పనుల సమయంలో ప్రమాదం చోటుచేసుకున్నది. ఓ లారీ తగలడంతో ఆర్చి కూలినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అధికారులు ఆర్చిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.
Wow, amazing weblog structure! How long have you ever been blogging for? you made running a blog look easy. The full glance of your site is excellent, as neatly as the content!!