ధ‌ర‌ణి ప్రారంభ‌మై నేటికి ఏడాది

హైద‌రాబాద్‌(CLiC2NEWS):  రైతుల వెత‌లు తీర్చా‌ల‌న్న సిఎం కెసిఆర్ క‌ల‌ల‌కు `డిజిట‌ల్‌రూపం` ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభ‌మై నేటికి ఏడాది పూర్తయింది. గ‌త సంవ‌త్స‌రం ఆక్టోబ‌ర్ 29వ తేదీన మేడ్చ‌ల్‌, మ‌ల్కాజిగిరి జిల్లా, మూడు చింత‌ల‌ప‌ల్లిలో సిఎం కెసిఆర్ ప్రారంభించారు. నాటినుండి రాష్ట్ర మంత‌టా ఒకేసారి రెజిస్ట్రేష‌న్‌, మ్యుటేష‌న్ జ‌ర‌గ‌టం అమ‌లులోకి వ‌చ్చింది. 1) రైతుల భూములు భద్రంగా ఉండాలి. ఇష్టమున్నట్టు వివరాలు మార్చేందుకు అవకాశం ఉండొద్దు. 2) ప్రపంచం లో ఏ మూలన ఉన్నా రాష్ట్రంలోని అన్ని రకాల భూముల వివరాలు కనిపించాలి. యజమానులు ఏ క్షణంలో అయి నా తమ భూమి వివరాలను చెక్‌ చేసుకొనేలా వ్యవస్థ ఉండాలి. 3) భూమి హక్కుల మార్పిడి ప్రక్రియను సులభతరం చేయాలి. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఏకకాలంలో జరగాలి. అనే ఈ మూడు సూత్రాల ఆధారంగా రాష్ట్రంలో ధరణి శకం మొద లై ఏడాదిగా విజయవంతంగా కొనసాగుతున్నది. ధ‌ర‌ణి విజ‌యంపై సిఎం హ‌ర్షం వ్య‌క్తం చేశారు. జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. రానున్న రోజుల్లో మ‌రిన్ని విజ‌యాలు సాధిస్తుందని తెలియ‌జేశారు.

 అద్భుత ప్రగతి

భూ పరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని ప్రభుత్వం తెలిపింది. ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే అద్భుత ప్రగతి సాధించిందని పేర్కొన్నది. ఏడాదిలోనే 10 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయని వెల్లడించింది. అంతకుముందు పాస్‌ పుస్తకాలు ఇవ్వని దాదాపు 1.80 లక్షల ఎకరాల భూమిని ఈ ఏడాది కాలంలో ధరణి పరిధిలోకి తీసుకొచ్చామని తెలిపింది. నిత్యం జరుగుతున్న మార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకొనే సామర్థ్యం ధరణి ప్రత్యేకత అని అధికారులు చెప్పారు. నిపుణులు, అధికారులు, ప్రభుత్వం నుంచి సలహాలు, సూచనలకు అనుగుణంగా మాడ్యూల్స్‌ ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మా డ్యూల్స్‌, 10 సమాచార మాడ్యూ ల్స్‌ ఉన్నాయి. ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లకే పరిమితం కాకుండా భూ సమస్యలను తీర్చే బాంధవిగా మారింది. పెండింగ్‌ మ్యుటేషన్లతోపాటు ఇతర భూ సమస్యలపై దరఖాస్తులు చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక మాడ్యూల్స్‌ ప్రవేశపెట్టారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అధికారులు పరిశీలించి పరిష్కరిస్తున్నారు. పోర్టల్‌ ద్వారా ఇప్పటివరకు 5.17 లక్షల ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయి.

1 Comment
  1. Mallesh+Yengani says

    దీని వల్ల లాభం ఏమో కాని నష్టం చాల జరుగుతుంది…

Your email address will not be published.