ఇందిరాగాంధీ సాహసం గురించి నేటి యువతకు తెలియాలి
బంగ్లాదేశ్ 50వ లిబరేషన్ డే

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ సాహసం గురించి నేటి యువతకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్ 50వ లిబరేషన్ డే సందర్భంగా.. ఇండో-పాక్ యుద్ధం 1971 అంశాలపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. భారతదేశాన్ని- ఇందిరాగాంధీని విడదీసి చూడలేమని సిఎల్పి నేత భట్టి విక్రమార్క అన్నారు. అటల్ బిహారి వాజ్‌పేయ్.. ఇందిరా గాంధీని దుర్గాదేవిగా అభివర్ణించారని గుర్తు చేశారు.
ఇండియాపై అమెరికా ఒత్తడి తెచ్చినా, దేశ సరిహాద్దుల్లో అమెరికన్ సైనికులు మోహరించినా, భారత సైనికులు వాళ్లని ఢీకొట్టేలా వాళ్లల్లో ధైర్యాన్ని నింపారని ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. .ఈ కార్యక్రమంలో ఎఐసిసి బంగ్లాదేశ్ ఉత్సవ కమిటీ కన్వీనర్ దావర్, మాజీ ఆర్మీ అధికారి ఎఆర్‌కె రెడ్డి, ఎఐసిసి కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.