టమాటా ఒక చిన్న అద్భుతమైన యాపిల్ పండు..

ఈరోజు మనం టమాటా గురించి తెలుసుకుందాం.

హిందీలో టమాటర్.. తెలుగులో టొమాటో, రామములగ పండు అని అంటారు.

లాటిన్:: లైకోపర్సికం ఎస్కులెంటం

కుటుంబం సోలనేసి చెందినది.

ప్రస్తుతం మార్కెట్లో టమాట కొన్ని ప్రాంతాల్లో రూ. 150 ధర, కొన్ని ప్రాంతాల్లో  ధర రూ.100కు దాటింది.

ప్రపంచ దేశాలు మొత్తము టమాటాను బాగా ఉపయోగిస్తారు. మన ఆహార పదార్థాల్లో సాధారణంగా బాగా వాడేది టమాటోలు. పప్పులో గాని ఇతర కూరల్లో గాని టమోటా లేనిదే కూర వండటం చాలా కష్టం. స్త్రీలు మాత్రం కూర వండేటప్పుడు తప్పకుండా టమాటాలు ఉంటేనే కర్రీని చేస్తారు .టమోటా లేని కర్రీ చేయడం వాళ్లకు ఏదో విధంగా బాధలాగా ఏదో కూరలో వెల్తి లాగా భావిస్తారు.వారు వండే కూరల్లో 80 శాతం టమాటాలతో చేసిన కర్రీలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి.టమాటాకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏర్పడటం జరిగినది.

అంతేకాదు దీనికి ఔష‌ధ గుణాలు కూడా ఎక్కువే..

చిన్నవిగా కంటికి నింపుగా అందరికి అందంగా కనపడుతూ ఆకర్షితులను చేసే విధంగా టమోటాలు కనిపిస్తాయి . వీటిని “LOVE APPLE ” అని కూడా అంటారు టమోటో లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కలదు ఇది క్యాన్సర్ ను నిరోధిస్తుంది.

ప్రతి 100 గ్రాముల టమాటాల యందు —
కార్బోహైడ్రేట్లు,
ప్రోటీన్లు,
కాల్షియం
ఫాస్పరస్
ఐరన్
పొటాషియం
సోడియం
సల్ఫర్
క్లోరిన్
కాపర్
నియాసిన్
ఫోలిక్యాసిడ్
ఇందులో ఇంకా
విటమిన్ ఏ,
విటమిన్ బి1
విటమిన్ బి2
విటమిన్ సి
విటమిన్ కె,
చక్కగా పుష్కలంగా ఉన్నాయి. మరియు సిట్రిక్ మాలిక్ మరియు అక్సాలిక్ యాసిడ్లు కూడా దీంట్లో చక్కగా ఉన్నాయి.
టమాటోలు చక్కగా జీర్ణమవుతాయి .ఇందులోని ఆసిడ్స్ కడుపుబ్బరంను తగ్గిస్తాయి .
టమోటాలు తినటం వల్ల విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధులు నిరోధించవచ్చు.

టమోటో రసం నందు కొద్దిగా మిర్యాల పొడి కలిపి సేవించిన లివర్ వ్యాధిగ్రస్తులకు, వేవీళ్ళతో బాధపడుతూ గర్భిణీ స్త్రీలకు, కామెర్ల రోగులకు, మలబద్దకం రోగులకు ఆహారం జీర్ణం కాని వ్యక్తులకు మరియు కడుపుబ్బరం కలిగి వాయువు బయటికి రాని రోగులకు చాలా మంచిది.

టమోటాలు కీళ్ల జబ్బులను, చర్మవ్యాధులను, ఆస్తమాను టీబి ని చక్కగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది

టమాటాలు పండిన తర్వాత కూరలోనే కాకుండా మనము దాన్ని ప్రత్యక్షంగా కూడా తినవచ్చును చాలా రుచిగా ఉంటాయి తీయగా ఉంటాయి. ఇవి తిన్న తర్వాత   జీర్ణ క్రియ చక్కగా పనిచేస్తుంది.

టమోటాలు తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. టమోటా రసము మరియు పసుపు కలిపి ప్రతి రోజు సేమించిన ఇస్నోఫిల్ కౌంట్ తగ్గుతుంది. ఎండాకాలంలో ఎండ దెబ్బతో బాధపడు రోగులకు ఇది చాలా మంచిది. టమాటా జ్యూస్ నందు పంచదార కలిపి త్రాగటం వలన చక్కని శక్తి ఉత్సాహం కలుగుతుంది. ఇది జ్వరముతో బాధపడుతూ నీరసంతో బాధపడు రోగులకు చాలా మంచిది. వేసవికాలంలో సేవించిన ఇది చల్లదనాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది
టమోటాలలో విటమిన్ సి కూడా కలదు ఇది మెంటల్ అలర్ట్ నెస్ ను పెంచుతుంది.

ఎదిగే పిల్లలకు.. 

ప్రతిరోజు టమోటా రసము మరియు తేనె కలిపి సేవించడం వలన రక్తం శుభ్రం అవుతుంది. మరియు చర్మవ్యాధులు నిరోధించబడతాయి అధిక మాంసాహారం సేవించిన వ్యక్తులుకు పచ్చి టమాటా సేవిస్తే ,ఆహారం త్వరగా జీర్ణమై, అధికంగా గ్యాస్ చేరకుండా చేస్తుంది. కడుపు ఉబ్బరం నివారిస్తుంది.

టమోటో రసము చక్కని సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది టమోటా రసమును లేదా టమోటాలను మెత్తగా చేసి ముఖమునకు పట్టించి ఒక గంట తర్వాత చక్కగా కడిగి వేసిన ముఖము వర్చస్సు పెరుగుతుంది మొటిమలు తగ్గుతాయి చాలా అందంగా కనిపిస్తారు.

టమోటాల పువ్వులను వేయించి సేవించిన కడుపు ఉబ్బరం మరియు అజీర్ణం తగ్గుతుంది టమోటాలను మధుమేహ రోగులు కూడా వాడవచ్చు టమోటాలలో ఫ్లైవ నాయిడ్స్ కూడా ఉంటాయి ఇది క్యాన్సర్ నీ నిరోధిస్తుంది

  • టమోటాలను మూత్రపిండాలు రాళ్లు ఉన్న రోగులు, వాత రక్తం గౌట్ రోగులు సేవించరాదు.

టమాటా పచ్చడి కి కచ్చపచ్చ గా ఉండేటటువంటి టమాటాలను ఉపయోగిస్తే టమోటా పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని కొద్దిగా నెయ్యి కలుపుకొని తింటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది చక్కగా జీర్ణ క్రియ అద్భుతంగా పనిచేయటం జరుగుతుంది.

టమాటా పచ్చడిలోని పచ్చిమిర్చిని ఉపయోగించాలి ఎండుమిర్చి కంటే కూడా పచ్చిమిర్చి ఉపయోగించి ఆ పచ్చడిని రెండు రోజుల్లోనే తిని వేయాలి. మిగిలిందని ఫ్రిజ్లో పెట్టి తింటే చాలా రోగాలకి నిలయం అవుతుంది మన కడుపు.

అప్పుడప్పుడు టమాటో రేటు తగ్గినప్పుడు రైతులు ఏం చేయాలో తోచక అమ్మినా సరే డబ్బులు రావు అనే ఆలోచనతో, ఈ నష్టపరిహారము నివారించుకోలేమని వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లినపుడు , రైతు కూరగాయల మార్కెట్ల వద్ద, రోడ్లమీద ట‌మాటాలు విసిరి వేసి పోతూ ఉంటారు .కానీ అలాగా చేయటం రైతులకు సబబు కాదు. దీనికి తగ్గట్టుగా మనము చక్కగా వేరే మార్గాన్ని ఎంచుకోవటం చాలా మంచిది. అలా టమాటాలకు గిట్టుబాటు ధర లేదని పారేసే బదులు టమోటా సాస్ చేసే వారికి అమ్మితే బాగుంటుంది.ఈరోజుల్లో ప్రతి హోటల్లో టొమాటో సాస్ తప్పకుండా వుండవలసిన అవసరం వచ్చింది.
మరియు ఎండిమిర్చితో టమాటాలు పచ్చడి గా చేసి సీసాలలో వేసి చక్కగా అమ్ముకున్న సరే మన యొక్క ఆదాయాన్ని చక్కగా పెంచుకోవచ్చును.

అంతేకాకుండా టమాటా రేటు తక్కువగా ఉన్నప్పుడు చక్కగా టమాటాలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి వాటిని చిన్నచిన్న ముక్కలుగా కోసి ఉప్పు పెట్టి లేదా టమాటలు చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కోసి ఎండకి పెట్టి అవి ఎండిపోయిన తరువాత వాటిని తీసుకొని ఒక సీసాలో భద్ర పరుచుకొని వుంచుకోవాలి.టమాటాల మార్కెట్లో దొరకనప్పుడు,రెట్లు పెరిగినప్పుడు పచ్చళ్ళుగా చేసుకోవచ్చు లేదా టమాటా రేటు బాగా పెరిగినప్పుడు కూర వందేటపుడు వీటిని వేసి చక్కగా చేసుకున్న మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. టమాటా ఒక చిన్న అద్భుతమైనటువంటి యాపిల్ పండు తో సమానం.

రక్తహీనతతో బాధపడే వారికి ఒక టమాట ముక్క తీసుకొని స్లైస్ దాని మీద చక్కగా పంచదార అద్ది అవి రోజుకు ఒక ముక్క తిన్నట్లయితే రక్తం చక్కగా శరీరంలో పెరుగుతుంది.

-షేక్. బహార్ అలీ
 ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.