పెళ్లింట విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ఆరుగురు మృతి

చిత్తూరు (CLiC2NEWS): జిల్లాలోని పూతలపట్టు మండలంలో పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. హేమంత్ కుమార్ వివాహం ఇవాళ పూతల పట్టు మండలం జెట్టిపల్లిలో జరగాల్సి ఉంది. దీనికోసం బంధువులంతా ట్రాక్టర్‌లో జెట్టిపల్లికి బయలు దేరారు. ఈక్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడి ఆరుగురు మరణించారు. క్షతగాత్రులను చిత్తూరులోని ఆస్పత్రికి తరలించారు. మృతులలో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ట్రాక్టర్ వేగంగా వెళ్లటం వలనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
I do consider all of the ideas you have introduced on your post. They are very convincing and can certainly work. Still, the posts are very quick for novices. May just you please prolong them a bit from next time? Thank you for the post.