హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినం..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే జరిమానా విధిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రాంగ్‌రూట్‌లో వస్తే రూ. 1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ. 1200 జరిమానా విధించనున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఈ రాంగ్ రూట్ ట్రిపుల్ రైడింగ్ కారణంగా దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. నవంబర్ 28వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ పాటించరో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.