కాంగ్రెస్ నుండి మర్రి శశిధర్‌రెడ్డి బహిష్కరణ
హైదరాబాద్ (CLiC2NEWS): కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని టిపిసిసి పార్టీ నుండి బహిష్కరించింది. టిపిసిసి క్రమశిక్షణ కమిటి ఆయనను ఆరేళ్లపాటు పార్టీనుండి సస్సెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ప్రకటించింది. కేంద్ర మంత్రి అమిత్ షా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణతో మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. దీంతో ఆయన బిజెపిలో చేరే అవకాశముందని ప్రచారాలు కొనసాగుతున్నాయి.