ప్రధాని మోడీ కవిత చెప్పిన ట్రినిడాడ్ ప్రధాని కమ్లా ప్రసాద్..
Port fo Spain: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరీబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో లో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఆయన ట్రినిడాడ్‌లో దిగిన వెంటనే అపూర్వ స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని కమ్లా ప్రసాద్ బిసెస్సార్ విమానాశ్రయంలో మోడీకి స్వాగతం పలికారు. ఈ దేశంలో భారత సంతతికి చెందిన ప్రజలు 40% ఉన్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ మాట్లాడారు.
ట్రినిడాడ్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ట్రినిడాడ్ ప్రధాని నరేంద్ర మోడీ కవితను వినిపించారు. గుజరాతీ భాషలో మోడీ రాసిన పుస్తకం Aankh Aa Dhanya Che (ఈ కళ్లు ఎంతో అదృష్టం చేసుకున్నాయనే అర్ధం) లోని కవితను ఆమె ప్రస్తావించారు. ఇది అక్కడున్నవారందరినీ ఆశ్చర్యపరిచిన విషయం.
ట్రినిడాడ్ ప్రధాని కమ్లా ప్రసాద్ బిసెస్సార్ ను బిహార్ ముద్దుబిడ్డగా మోడీ పేర్కొన్నారు. ఆమె పూర్త్వీకులు బిహార్‌లోని బక్సర్ కు చెందిన వారని తెలిపారు. అక్కడి ప్రజలు ఆమెను బిహార్ కుమార్తెగా బావిస్తారన్నారు. . మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఇప్పటికి వారి ఆహారం, సంగీతం, భాషల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఇరు దేశాల మధ్య బలమైన స్నేహం ఉందని.. ట్రినిటాడ్ లోని పలు వీధులకు బనారస్, కోల్‌కతా, పట్నా, ఢిల్లీ వంటి పేర్లు ఉన్నాయని మోడీ తెలిపారు.
