దిగ్విజయంగా ద్వితీయ వసంతంలోకి..

స్వాతంత్ర పర్వదినంతో ప్రభవించిన వెబ్ పత్రిక

సమాజావిష్కరణ దృశ్యమాలికా చిత్రిక..!

స్వతంత్ర భావాలకు ప్రతీక

నిష్ప‌క్ష‌పాత‌ వైఖరే నిండు ప్రాణంగా

అసమాన ఆవిష్కరణగా అందరి ముందట

విశ్వ సమాచారం ఓ క్లిక్ దూరంలోనే..

వెబ్ యుగంలో `CLiC2NEWS` ఒక నిశ్శబ్ద విప్లవం. `no favour, no fear` అనే ఉన్నతాశయాలతో ప్రారంభమైన `CLiC2NEWS` వెబ్‌సైట్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. గత ఏడాది పంద్రాగస్టు రోజున మొదలై.. ఈనాటి 75వ స్వతంత్య్ర దినం రోజున రెండో వసంతంలో అడుగిడుతోంది.

ఒక్కమాట అంటూ లక్ష ఆలోచనలను రేకెత్తించేదే `CLiC 2 NEWS`

‘‘నాలుగు దిక్కులు నావేనని.. ఒక్క దృక్కోణమేలనోయి..
పలు దృక్పధాలు మనవోయి.. పరిపరివిధాల ప్రపంచ కిటికీలు తెరువోయి..
`CLiC2NEWS` ఈ కొత్త భావాల్ని భుజానమోస్తూ అరచేతిలో అద్భుతాలను పెడుతున్నది.

చూపుడు వేలు స్పష్టత చిహ్నమై వార్తా సమాహారమవుతున్నది.. పడమర, తూర్పు, ఉత్తర, దక్షిణాలు భూగోళపు గుర్తులు.. ఎల్లలు లేని లోకప్రవృత్తి హృదయవీణలను మీటమంటున్నది `CLiC2NEWS`.

తనదైన ముద్రతో `no favour, no fear` అనే సూత్రాలపై నడుస్తున్నది. సూత్రప్రాయంగా సమ వీక్షణం చేయిస్తున్నది. సర్వకాల సర్వావస్థల్లోనూ బి అలర్ట్ అంటూ జాతీయ, అంతర్జాతీయ వేదికగా నిలుస్తున్నది.

నిన్నను మరచిపోకుండా, రేపటి బ్రతుకును ఊహిస్తూ.. ప్రస్తుతంలో జీవించే మార్గమేదో సూచిస్తున్నది. దోహదమేదో, దోపిడీ ఏదో.. విశ్లేషిస్తూ, వ్యాపార, వాణిజ్య అంశాలను మీ ముందు కుప్పబోస్తున్నది. `CLiC2NEWS` అంటేనే ప్రపంచాన్ని దోసిటబట్టే వార్తా సమాహార పాత్ర…

నిబద్ధత, నిర్ధుష్టత నిజాయితీలే ఆరవ ప్రాణంగా నిలుస్తుంది. నిత్యం మనుషుల ప్రాపంచిక క్రీడా విశేషాలను చూపినట్లే ప్రపంచ క్రీడా వేశేషాలను చెప్తుంది.

కంటికి ఇంపయితే.. హృదయానికి ఇంపవుతుందన్న సత్యాన్ని `CLiC2NEWS` ఎప్పుడో పసిగట్టింది. అందుకే క్లిక్2 సిత్రం అనే బొమ్మ‌గా రూపుకట్టింది. ఆలోచనలు రేకెత్తించే కార్టూన్లు ఇస్తూనే, ఆనందాన్ని పంచే సినీ మాయలోకాన్ని మీ ముందుంచుతుంది. సంప్రదాయవాదుల కల్పతరువై వారఫలాలు, పంచాంగం అందించే ప్రయత్నం చేస్తున్నది.

సార్వకాలీన వస్తువైవిధ్యంలో వస్తున్న సాహిత్యం కూడా `CLiC2NEWS` స్వాగతిస్తుంది. కథలు, కవితలుగా మీకు దోసిలిబడుతుంది. తర్కవితర్కాలు కలగలిసినదే కదా జీవితం..ఆధ్యాత్మికంగానూ, శాస్త్రీయంగానూ ఆదర్శమైన విషయాలను మీ ముందు ఉంచుతుంది. వార్తలో జగం వర్థిల్లుతున్నదన్న సత్యాన్ని అంతర్జాల స్వరూప విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మీ అందరికి నచ్చే రీతిలో తెలుగు లోగిలిని తన చిరునామా చేసుకున్నది మీ కోసం!

మీ అభిప్రాయాల్ని అమూల్యమైనవిగా నిర్వచించుకొని, ఆదర్శాన్ని తనది చేసుకొని, సమాజశ్రేయస్సుకోసం `CLiC` చేయమంటున్నది `CLiC2NEWS`. రాజకీయాలు, విద్య, వైజ్ఞానికరంగాల పోకడలను సామాన్యుల సమగ్రాభివృద్ధి కోసం అన్యాయాన్ని ఎదురించే గొంతుక మీది చేసుకోమంటూ తన వంతు కృషి చేస్తున్నది `CLiC2NEWS`.

సమకాలిన రాజకీయాలు, సామాజికాంశాలకు తోడు సినిమా విశేషాలు, విశ్లేషణలు, విలక్షణమైన డిస్‌ప్లే, అందమైన డిజైన్‌తో అక్షరాలను ఏర్చి కూర్చిన ఈ `CLiC2NEWS`ను తెలుగు పాఠకులు విశేషంగా ఆదరించారు. జర్నలిజంలో విశేషానుభవం ఉన్న పాత్రికేయులూ, ఉత్సాహం ఉన్న యువ రచయితల మేలు కలయికతో వచ్చిన ఈ వెబ్ సైట్‌ను ఆదరిస్తున్న ఉత్తమాభిరుచిగల మా వీక్షకులకు, విజ్ఞులయిన ప్రకటనదారులకు ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు.. ఎల్లవేళల ఇదే సహాయ సహకారాన్ని మీ నుంచి ఆశిస్తూ….

-ఎడిటర్
`CLiC2NEWS`

4 Comments
  1. Mallesh+Yengani says

    75వ స్వతంత్య్ర దినం రోజున రెండో వసంతంలో అడుగు పెడుతున్న క్లిక్2న్యూస్ కు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజెస్తుంన్నాను…..💐💐💐💐💐

    1. admin says

      tq

  2. Mallesh+Yengani says

    75వ స్వతంత్య్ర దినం రోజున రెండో వసంతంలో అడుగు పెడుతున్న క్లిక్2న్యూస్ కు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు….💐💐💐
    మరెన్నో సంచలనాలకు కేంద్ర బిందువు కావాలని కోరుకుంటున్న…

    1. admin says

      tq

Leave A Reply

Your email address will not be published.