హుజూరాబాద్‌లో టిఆర్ఎస్ ప్రచార హోరు

హుజురాబాద్ (CLiC2NEWS): హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం గురువారం ఇంటింటి ప్రచారంనిర్వహించారు. ఈ ప్రచారంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం కొత్తగూడెం నుండి వచ్చిన టిఆర్ఎస్ నాయకులు మొరే భాస్కర్రావు, టిఆర్ఎస్ విద్యార్థి విభాగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోఆర్డినేటర్ సంకుబాపన అనుదీప్, మాజీ కౌన్సిలర్ యూసుఫ్ , టిఆర్ఎస్ విద్యార్థి నాయకులు బావు సతీష్ యాదవ్ సహా పలువురు నాయకులు ఇక్కడ ప్రచారం నిర్వహించారు.

హూజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో స్థానిక రైతులతో ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ తో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం హుజూరాబాద్ పట్టణంలోని గాంధీ నగర్ కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.

అలాగే నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలంలో ప్రభుత్వవిప్ బాల్క సుమన్ తో కలిసి ప్రచారంలో కలిసి కొత్తగూడెం నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
హుజూరాబాద్ పట్టణం లోని బోర్నవల్లిలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఇక్కడ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ గంధె రాధిక తో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ అమలుచేస్తున్న సంక్షేమపథకాలను ఓటర్లకు వివరించారు. భారీ మెజారిటీతో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని కోరారు.
