TRS పార్టీ యువజన విభాగం అధ్యక్షుడికి ఘనంగా సన్మానం

మంచిర్యాల () జిల్లా కేంద్రంలోని లక్ష్మి నగర్ కాలనీ లో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్చంద సేవా సంస్థ , సింగరేణి రిటైర్డ్ మెంట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో TRS పార్టీ యువజన విభాగం అధ్యక్షులుగా పట్టణానికి నూతనంగా ఎన్నుకోబడ్డ బింగి ప్రవీణ్ కు శుక్ర‌వారం ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ..బింగి ప్రవీణ్ కు TRS పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించినందుకు MLA న‌డిపెల్లి దివాక‌ర్‌రావు, విజిత్ రావు కి కృతజ్ఞతలు తెలియజేశారు. మూడు తరాల పోరాట వీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో నెలకొల్పలాని ఈ సంద‌ర్భంగా ప‌లువురు కోరారు. తెలంగాణ రాష్ట్రం లో 15% ఉన్న పద్మశాలియులకు చట్ట సభల్లో ఒక MLA, MP లేకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. పద్మశాలియుల కు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అర్హులైన వారికి పద్మశాలి బంధు ప్రవేశ పెట్టి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని స్థానిక MLA కి , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య, నాయకులు DSC బోస్, ఏ రాజేశం, జంజిరాల నారాయణ, చిప్ప రామస్వామి, మామిడాల సత్యనారాయణ, లక్ష్మణ్, రాజీ రెడ్డి, ఇట్టం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.