TS: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్ర‌థ‌మ‌, ధ్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల షెడ్యూల్ గురువారం విడుద‌లైంది. మే 1 నుంచి 20 వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు వెల్ల‌డించింది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 20 వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు నిర్వహంచనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఏప్రిల్‌ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష, ఏప్రిల్‌ 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సుల పరీక్షలకూ ఇదే షెడ్యూల్‌ వర్తించనుంది.

Leave A Reply

Your email address will not be published.