TS: తెలంగాణలో పగటిపూట లాక్‌డౌన్ ఎత్తివేత
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు లాక్‌డౌన్ సడలింపునిచ్చింది. ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు మరో గంట వెసులుబాటును కల్పించింది. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల మధ్య కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని సర్కార్ ప్రకటించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి ఈ నెల 19 వరకు లాక్‌డౌన్ కొత్త నిబంధనలు అమలులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
కాగా నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మినహా నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాల్లో యధావిధిగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే లాక్‌డౌన్ మినహాయింపు ఉంది. వీటితోపాటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో కూడా లాక్‌డౌన్ యధావిధిగా కొనసాగనుంది.