TS: నేడు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో మంత్రి భేటీ

హైదరాబాద్‌ (CLiC2NEWS):  జూలై 1 నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు ప్రారంభంకానున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధ‌వారం (ఇవాళ‌) ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో పాఠ‌శాల‌లు, కాలేజీల పునఃప్రారంభంపై చర్చించనున్నారు. అలాగే విధివిధానాలు, ఫీజులపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇంటర్‌, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన అంశంపై కూడా చర్చించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.