TS: మంత్రి హ‌రీశ్‌రావు కాన్వాయ్‌కు ప్ర‌మాదం

సిద్దిపేట (CLiC2NEWS): సిద్దిపేట నుండి హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరిన‌ తెలంగాణ ఆర్ధిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు కాన్వాయ్ ప్ర‌మాదానికి గురైంది. కొండ‌పాక మండ‌లం బండారం ద‌ర్గా క‌మాన్ స‌మీపంలో ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో హ‌రీశ్‌రావు గ‌న్‌మెన్‌కు గాయాల‌య్యాయి, హ‌రీశ్‌రావు కారు ముందుభాగం స్వ‌ల్పంగా ధ్వంస‌మైంది. అడ్డువ‌చ్చిన అడ‌వి పందుల‌ను త‌ప్పించ‌బోయి డ్రైవ‌ర్ బ్రేక్ వేయ‌డంతో వెనుక ఉన్న పైల‌ట్ వాహ‌నం త‌ర్వాత ఉన్న హ‌రీశ్‌రావు కారు ఒక‌దానికొక‌టి ఢీకొని ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. మ‌రో కారులో మంత్రి హ‌రీశ్‌రావు హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరి వెళ్లారు.

 

Leave A Reply

Your email address will not be published.