TS: ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో రేషన్‌కార్డుదారులకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ చేస్తున్నారు. ప్రతి లబ్ధిదారునికి 15 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. ఈ పంపిణీ ఈనెల 20 వరకు కొనసాగనుంది. సాధారణంగా కార్డులో ఉన్న ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తుండగా.. ఈనెలలో 15 కిలోలు ఇస్తున్నారు.