TS: సిద్దిపేటలో రూ.కోటి విలువైన విత్తనాలు స్వాధీనం

సిద్దిపేట (CLiC2NEWS): సిద్దిపేట జిల్లాలో గడువు ముగిసిన విత్తనాలను భారీ స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని బండమైలారం గ్రామ శివారులోని కర్నూల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గడువు ముగిసిన విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సోమవారం రాత్రి ములుగు ఎస్ఐ రంగకృష్ణ, గజ్వేల్ డివిజన్ ఏడిఏ అనిల్ కుమార్, ఏఓ ప్రగతి, మరియు పోలీసు సిబ్బందితో కలసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన వరి ధాన్యానికి సంబంధించి 10,850 ప్యాకెట్స్, 425 క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విత్తనాల విలువ రూ. ఒక కోటి 90 లక్షల 30 వేలు ఉంటుందని పోలీసులు చెప్పారు.