TS: 30న కేబినెట్ భేటీ

హైదరాబాద్ (CLiC2NEWS): ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ సిఎం కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు హాజరు కానున్నారు. కరోనా పరిస్థితులు, లాక్డౌన్ అంశంతో పాటు వ్యవసాయం, పంటలు, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధంపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. రాష్ర్ట ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పొడిగిస్తారా? లేదా అన్న అంశంపై తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది.
ఈ నెల 30 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలో వ్యవసాయం, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు, కరోనా, లాక్ డౌన్ తదితర అంశాల మీద క్యాబినెట్ చర్చించనున్నది.
— Telangana CMO (@TelanganaCMO) May 26, 2021