TS: 30న కేబినెట్ భేటీ

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఈ నెల 30వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు తెలంగాణ సిఎం కెసిఆర్ అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి మంత్రుల‌తో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఇత‌ర అధికారులు హాజ‌రు కానున్నారు. క‌రోనా ప‌రిస్థితులు, లాక్‌డౌన్ అంశంతో పాటు వ్య‌వ‌సాయం, పంట‌లు, ధాన్యం సేక‌ర‌ణ‌, విత్త‌నాలు, ఎరువుల ల‌భ్య‌త‌, క‌ల్తీ విత్త‌నాల నిరోధంపై కేబినెట్ భేటీలో చ‌ర్చించ‌నున్నారు. రాష్ర్ట ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్ ఈ నెల 30వ తేదీతో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ పొడిగిస్తారా? లేదా అన్న అంశంపై తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఉత్కంఠ నెల‌కొన్న‌ది.

Leave A Reply

Your email address will not be published.