TS: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు 37 పోలింగ్ కేంద్రాలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో శుక్రవారం జరగనున్నస్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సి ఎన్నికల పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఆదేశించారు. ఎన్నికలు జరగనున్న జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు, అధికారుతో సిఈఒ సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో మొబైల్ ఫోన్లు, కెమెరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆరు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల కోసం 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పటు చేసినట్టు సిఈఒ తెలిపారు. ఈ ఎన్నికలలో 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ లే వీడియోగ్రఫీ ఉంటుందని చెప్పారు.