TS: 8న కేబినెట్ సమావేశం..

హైదరాబాద్‌ (CLiC2NEWS): ఈ నెల 8న ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు అధ్య‌క్షత‌న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మంగ‌ళ‌వారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ స‌మావేశంలో రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయ పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశమున్నది.

9న డయాగ్నొస్టిక్‌ కేంద్రాల ప్రారంభోత్సవం

రేపటి నుంచి (7న) ప్రారంభించాలనుకున్న 19 జిల్లాల్లో 19 డయాగ్నస్టిక్‌ సెంటర్లను జూన్ 9 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు ఏక కాలంలో పాల్గొని ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో, మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయం మీద కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.

Leave A Reply

Your email address will not be published.