TS: దళిత బంధు నిధులు రూ.500 కోట్లు విడుదల
కరీంనగర్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం దళిత కుటుంబాల అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం కోసం మరో రూ.500 కోట్లు మంజూరు చేసింది. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మొదటి విడతలో రూ.500 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రజెక్టు కోసం మొత్తం రూ. 1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వారం రోజుల లోపు మరో వెయ్యికోట్ల నిధులు కూడా ప్రభుత్వం విడుదల చెయ్యనుంది.