TS: జగిత్యాలలో ముగ్గురు యువకులపై దాడి

జగిత్యాల (CLiC2NEWS): తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ముగ్గురు మువకులపై కత్తులతో దాడి జరిగింది. ఈ ఘటన పట్టణంలోని తీన్‌ఖాని చౌరస్తాలో గురువారం ఆర్ధరాత్రి జరిగింది. ముగ్గురు వ్యక్తులలో ఇద్దరికి తీవ్రగాయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడినవారు కావలనే దాడి చేశారని బాధితుల తరపు బందువులు ఆరోపిస్తున్నారు. నిందుతులను కఠినంగా శిక్షించాలని బాధిత తరపువారు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోలనకారులను చెదరగొట్టారు.