TS:నేడు ఆర్టీసీ బ‌స్ డిపోల్లో ర‌క్త‌దాన శిబిరాలు

హైదరాబాద్‌(CLiC2NEWS) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగ‌ళ‌వారం ఆర్టీసీ బ‌స్సు డిపోల్లో ర‌క్త‌దాన శిబిరాలు నిర్వ‌హించ‌నున్నారు. ఆర్టీసీ సిబ్బంది ర‌క్త‌దానం చేసి ఇత‌రుల‌ను ఆదుకోవాల‌ని ఆర్టీసీ ఎండి స‌జ్జ‌నార్ పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ర‌క్త‌దానం చేసిన వారికి  ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించేందుకు ఆర్టీసీ అవ‌కాశం క‌ల్పించ‌నుంది. ఆర్టీసీ యాజ‌మాన్యం, ఇండియ‌న్ రెడ్ క్రాస్ సొసైటి సంయుక్త భాగ‌స్వామ్మంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో మెగా ర‌క్త దాన శిబిరాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.