TS: వ్య‌వ‌సాయ బావిలోకి దూసుకెళ్లిన కారు: ఒక‌రు మృతి

క‌రీంన‌గ‌ర్‌ (CLiC2NEWS): ‌జిల్లాలోని చిగురుమామిడి మండ‌లం చిన్న మ‌ల్క‌నూరు వ‌ద్ద ఈరోజు ఉద‌యం వ్య‌వ‌సాయ బావిలోకి కారు దూసుకెళ్ళింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లం వ‌ద్ద కారును వెలికితీసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. స‌మారు 8 గంట‌ల పాటు గాలింపు చ‌ర్య‌ల అనంత‌రం క్రేన్ల సాయంతో కారును బ‌య‌ట‌కు తీశారు. కారులో ఒక మృత‌దేహం ల‌భ్య‌మ‌యింది. మృతుడు విశ్రాంత ఉద్యోగి ఎస్ఐ పాప‌య్య‌నాయ‌క్ గా గుర్తించారు. ఈయ‌న హుస్నాబాద్ అక్క‌న్న‌పేట‌లో ఎస్ఐగా విధులు నిర్వ‌హించి, ఇటీవ‌లే ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు.

Leave A Reply

Your email address will not be published.