TS Corona: కొత్తగా 4,693 కేసులు.. 33 మ‌ర‌ణాలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కొత్తగా 4,693 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ గురువారం సాయంత్రం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,16,404 కి చేరింది.

తాజాగా ఒక్కరోజు రాష్ట్రంలో 6,876 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 4,56,620 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 56,917 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కొత్త‌గా రాష్ట్రంలో కరోనాతో 33 మంది మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,867 కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.