TS Corona: కొత్తగా 1,707 కోవిడ్ కేసులు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమ క్రమంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 1,707 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మరో 16మంది కోవిడ్ బారిన పడి మరణించారు. కాగా కరోనా నుంచి 2,493 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,759 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.