TS Corona: కొత్తగా 3,308 కేసులు.. 21 మరణాలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 63,120 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 3,308 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.
తాజాగా కరోనా మహమ్మారికి రాష్ట్రంలో మరో 21 మంది బలయ్యారు. అలాగే కరోనా నుంచి మరో 4,723 మంది బాధితులు కోలుకున్నారు.ప్రస్తుతం 42,959 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 513 కరోనా కేసులు నమోదు కాగా.. ఖమ్మం జిల్లాలో 228, రంగారెడ్డి జిల్లాలో 226, మేడ్చల్ జిల్లాలో 203, కరీంనగర్ జిల్లాలో 161 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో రికవరీ రేటు 91.64 శాతం ఉండగా.. మరణాల రేటు 0.56 శాతంగా ఉంది.