TS Corona: కొత్త‌గా 1436 కేసులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): లాక్‌డౌన్ ప్రభావం వల్ల తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌డిచిన 24 గంటల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో 97,751 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వ‌హించ‌గా 1436 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు ఆదివారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 5,91,170 కరోనా కేసులు న‌మోద‌య్యాయి.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో క‌రోనా బారిన‌ప‌డి మ‌రో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3378 మరణాలు నమోదు అయ్యాయి. అలాగే 3,614 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,016 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని అధికారుల తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.