TS Corona: కొత్తగా 1,933 కేసులు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన గత 24 గంట్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం సాయంత్రం కరోనా బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,93,103కి చేరింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 16 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో 3,527 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,406 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. కాగా జిహెచ్ ఎంసి పరిధిలో కొత్తగా 165 కేసులు నమోదయ్యాయి.