TS Corona: కొత్తగా 2,261 కేసులు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కోవిడ్ రోజువారి పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 2,261 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు గురువారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో 18 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో. అలాగే 3,043 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు
రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిపోయిందని, రికవరీ రేటు 99.5 శాతానికి పెరిగందని పేర్కొన్నారు. తెలంగాణలో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు కావడంతో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయన్నారు.