AP Corona: తగ్గిన కరోనా కేసులు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గు ముఖం పట్టాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 11,421 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,25,682 కు చేరింది.
గడిచిన 24 గంటల్లో ఏపీలో 16,223 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 15,75,557 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 81 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు ఏపీలో కరోనాతో 11,213 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,38,912 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
