TS Corona: 8061 కేసులు.. 56 మరణాలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లో క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కొత్త‌గా 8061 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బుధవారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో నమోదైన మొత్తంకరోనా కేసుల సంఖ్య 4,19,666కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 3,45,683 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కరోనా బారిన ప‌డి 56 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2150కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 72,133 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని అధికారులు వెల్ల‌డించారు. తెలంగాణ‌లో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ పరిధిలో 1,508 కేసులు ఉన్నాయి. తర్వాతి స్థానంలో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 673, రంగారెడ్డి జిల్లాలో 514, సంగారెడ్డి జిల్లాలో 373, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 328 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివ‌రాలు..

Leave A Reply

Your email address will not be published.